న్యాయవాదులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి
– మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి టీ.స్వప్న
తాండూరు, దర్శిని ప్రతినిధి : న్యాయవాదులు తమ ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలని తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి టీ.స్వప్న సూచించారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ఆవరణలో పట్టణానికి చెందిన బసవేశ్వర ఆసుపత్రి సహాకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి శ్రీమతి టీ.స్వప్న మాట్లాడుతూ న్యాయవాదులు విధులతో పాటు వారి ఆరోగ్యాలపై కూడ శ్రద్ద వహించాలన్నారు. పనిఒత్తిడిలో పడి ఆరోగ్యాలపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ శిబిరంలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాకేష్, డాక్టర్ వందనలు వైద్య సేవలు అందించారు.
బీపీ, షుగర్‌తో ఇతర వ్యాధులకు సంబంధించి పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వైద్య పరీక్షలను చేయించుకున్నారు. దీంతో కోర్టు ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, భవనప్ప, పి.శ్రీనివాస్, నర్సింగ్ రావు, రాంరెడ్డి, అనితాగుప్త, పాశం రవికుమార్, బి.రవికుమార్, మస్తాన్ అలీ, గోపాల్, అరుణ, వాణిశ్రీ, సుదర్శన్, శ్రావణ్ కుమార్, ఆంజనేయులు, నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జిలాని తదితరులు పాల్గొన్నారు.

