బల్దియా పీఠం దిగాల్సిందే..!
– ఎమ్మెల్సీ సమక్షంలోనే రెండున్నర ఏళ్ల ఒప్పందం
– ఎమ్మెల్సీ మాట మార్చడం తగదు
– టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠంపై ఒప్పంద రాజకీయ వ్యవహారం మరింత ముదురుతోంది. చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న స్వప్న పరిమళ్ దిగిపోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తం చేసే నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం ఒప్పందంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన దర్శిని ప్రతినిధితో మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిపై స్వప్న పరిమళ్, వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు మద్య ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. 2020 జనవరిలో వచ్చిన ఎన్నికల ఫలితాల అనంతరం ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఈ ఒప్పందాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. అప్పట్లో వచ్చిన మీడియా కథకాలను కూడ దర్శిని ప్రతినిధికి విడుదల చేశారు. ఐదేళ్ల పదవి కాలాన్ని స్వప్న పరిమళ్, పట్లోళ్ల దీపా నర్సింలు పంచుకుంటారని ఎమ్మెల్సీ చేసిన వాఖ్యలను గుర్తుచేశారు. అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండున్నరేళ్ల ఒప్పందాలు జరిగాయని స్వయంగా ఎమ్మెల్సీ ప్రకటించారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కూడ రెండున్నరేళ్ల ఒప్పందం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పినట్లు రాజుగౌడ్ తెలిపారు. 2014లో టీఆర్ఎస్, ఎంఐఎం మద్య జరిగిన అగ్రిమెంట్‌ను ఉదహరించి వివరించారని స్పష్టం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన నివాసంలో చైర్ పర్సన్ ఐదేళ్లు కొనసాగుతారని చేసిన వాఖ్యలు ద్వంద వైఖరిని తెలియజేస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. … ఇంకా ఉంది…
దర్శిని ప్రతినిధికి రాజుగౌడ్ విడుదల చేసిన పత్రిక కథనాలు
—————————————————————




