అర్చకుడిని ఆనంద‌ప‌ర్చిన రొంపల్లి సంతోష్ కుమార్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

అర్చకుడిని ఆనంద‌ప‌ర్చిన రొంపల్లి సంతోష్ కుమార్
– తండ్రి స్మారకార్థం మూడు నెలల నిత్యవసర సరుకుల వితరణ
– ఆగ్నిప్ర‌మాదంలో ఇళ్లు కోల్పోయిన‌ అర్చ‌కున్ని ఆదుకోవాల‌ని పిలుపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై ఆసరా కోల్పోయిన ఆర్చకుడిని వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ చేయూత‌నందించి ఆనంద‌ప‌రిచారు. వివ‌రాల్లోకి వెళితే గ‌త‌వారం క్రితం పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన జంగం చంద్రశేఖర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తినష్టం జరిగింది. ఇంటితోపాటు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కాలి బూడిద కావడంతో ఆసరా కోల్పోయాడు. తాండూరులోని అంతప్పభావి శివాలయం పూజారి ద్వారా విషయం తెలుసుకున్న రొంపల్లి సంతోష్ కుమార్ అర్చకుడికి చేయూనందించేందుకు ముందుకొచ్చారు. మంగళవారం తన తండ్రి రొంపల్లి కిష్టయ్య స్మారకార్ధం సొంత నిధులతో మూడు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం, నూనే ఇతర వస్తువులను అర్చకుడు జంగం చంద్రశేఖర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆసరా కోల్పోయిన అర్చకుడిని అందరు సహృదయంతో ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు అర్చకుడు జంగం చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు సహాయం అందించిన వైశ్య ఫెడరేషన్ ద్వారా సహాయం అందించినందుకు రొంపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.