పాన్ కార్డ్ పోతే..!
– ఇంటి నుంచే కొత్తది పొందొచ్చు
– ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా
దర్శిని డెస్క్ : బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారులు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డ్ ఒకటి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. వినియోగదారులు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ (PAN Card) వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించేందుకు పాన్ (PAN) లేకుండా చేయడానికి విలుపడదు. అయితే మీ పాన్ కార్డ్ పోయినా, దొంగిలించబడినా లేదా పాడైపోయినా.. ఎలాంటి టెన్షన్ పడనక్కరలేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కార్డును రీప్రింట్ (Card Reprint) చేయడానికి మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఈ కింది విధంగా తెలుసుకుందాం.
ఈ కింది లింక్‌ను ఉపయోగించండి:
https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html
లింక్‌ను క్లిక్ చేసిన తరువాత అందులో కనిపించే వివరాలను పూరించాలి. మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను నమోదు చేయాలి. కార్డ్‌ను మళ్లీ ముద్రించడానికి ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు అనుమతి ఇవ్వాలి. చివరగా ఫారము సమర్పించడానికి మీరు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ రీప్రింట్, మీ ఇంటికి డెలివరీ చేయడానికి మీరు కొంత రుసుము చెల్లించాలి. ఫారం నింపిన తర్వాత ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 రుసుము చెల్లించాలి. భారతదేశం వెలుపలి చిరునామాకు కార్డును డెలివరీ చేయడానికి మీరు రూ. 959 చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన తర్వాత మీ రీప్రింట్ చేసిన పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిరునామాకు పంపబడుతుంది. అలాగే మీరు UTIITSL వెబ్ సైట్లో తాజా PAN దరఖాస్తును చేసి ఉంటే ఈ లింక్‌ను సందర్శించడం ద్వారా రీప్రింట్ అప్లికేషన్ ను సమర్పించాలి. https://www.myutiitsl.com/PAN_ONLINE/homereprint.
రీప్రింట్ షరతులు:
కార్డు వివరాల్లో ఎలాంటి మార్పు లేకుంటే మాత్రమే రీప్రింట్ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని NSDL e-Gov ద్వారా తాజా PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN సదుపాయాన్ని ఉపయోగించి PAN పొందిన కార్డ్ హోల్డర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

