అంబేద్క‌ర్ రాజ్యంగంతోనే సుస్థిర పాల‌న

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

అంబేద్క‌ర్ రాజ్యంగంతోనే సుస్థిర పాల‌న
– మ‌హ‌నీయుని స్పూర్తితో ముందుకు సాగాలి
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: డా.బీఆర్ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగంతోనే సుస్థిర పాల‌న జ‌రుగుతోంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. గురువారం అంబేద్క‌ర్ 131వ జ‌యంతి సంద‌ర్భంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కోట్‌ప‌ల్లి, పెద్దేముల్, తాండూరు మండ‌లం, తాండూరు ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన కార్య‌క్రమాల్లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పాల్పంచుకున్నారు.
తాండూరు మండ‌లం అంతారం, తాండూరు ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తా, పాత తాండూరు అంబేద్క‌ర్ పార్కు త‌దిత‌ర ప్రాంతాల్లోని అంబేద్క‌ర్ విగ్ర‌హానికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి, ప్ర‌పంచంలోనే మేధావి అయిన డా.బీఆర్ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగంతో అంద‌రికి సుస్థిర పాల‌న అందుతుంద‌ని అన్నారు. ఆయ‌న స్పూర్తి అంద‌రు ముందుకు సాగాల‌న్నారు. ఎమ్మెల్సీ వెంట….
టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తం రావు, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, ఫ్లోర్ లీడ‌ర్ శోభారాణి, కౌన్సిల‌ర్లు నీర‌జాబాల్ రెడ్డి, ప్ర‌వీణ్ గౌడ్, స‌ర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతు, టీఆర్ఎస్ నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మ‌సూద్, బీర్క‌డ్ ర‌ఘు, అశోక్, ద‌త్తు, శ్రీ‌కాంత్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.