హస్తంలో కల్లోలం..!
– బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో విభేధాలు
– మైల్వార్‌లో పురుగుల మందు సేవించిన నేత
– పార్టీ సమావేశంలో మాట్లాడనివ్వలేదని మనస్థాపం
– మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ తరలింపు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీలో విభేధాలు బహిర్గతమయ్యాయి. అధికార పార్టీలోని కొందరి నేతల వల్ల మనస్థాపం చెందిన ఓ నేత పురుగుల మందు సేవించినట్లు బాధిత కుటుంభీకులు తెలిపారు. గురువారం బషీరాబాద్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన తరువాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు మండలంలో కీలక నేతగా ఉన్న మరొకరు తన ఎదుగుదలకు అడ్డం పడుతున్నట్లు బిచ్చిరెడ్డి విమర్శించారు. గురువారం మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బుచ్చిరెడ్డి కూడా హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడుతుండగా ఓ నేత అడ్డం చెబుతూ తానే మైకులో మాట్లాడడం ప్రారంభించారు. దీంతో బెచ్చిరెడ్డి మనస్థాపం చెందారు. సమావేశం తరువాత ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించారు. గమనించిన కుటుంభీకులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ తరలించారు. ఈక్రమంలో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు వేయించే విషయంలో గ్రామానికి చెందిన సతీష్, బుచ్చిరెడ్డిల మద్య వాగ్వివాదం జరిగినట్లు తెలిపారు. సతీష్ అనే వ్యక్తితో పాటు అధికార పార్టీకి చెందిన నేత అజయ్ ప్రసాద్ వల్లే బుచ్చిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి….

