మన‌సు దోచిన మార్వాడి యువ‌మంచ్..!

తాండూరు వికారాబాద్

మన‌సు దోచిన మార్వాడి యువ‌మంచ్..!
– తాండూరులో మ‌జ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: సామాజిక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే తాండూరు మార్వాడి యువ‌మంచ్ శాఖ మ‌రోసారి ప్ర‌జ‌ల మ‌న‌సును దోచింది. ప్ర‌తి యేడాది వేస‌విలో ఏర్పాటు చేసే ఉచిత మ‌జ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఈ సారి కూడ ప్రారంభించింది. శ‌నివారం తాండూరు ప‌ట్ట‌ణం ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో ఏర్పాటు చేసిన ఉచిత మ‌జ్జిగ పంపిణీ కేంద్రాన్ని రాజ‌స్థాని మ‌హిళ మండ‌లి అధ్య‌క్షురాలు ప‌ద్మావ‌తి సోని, కార్య‌ద‌ర్శి కిర‌ణ్ సార్డాలు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మార్వాడి యువ‌మంచ్ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు మ‌న్మోహ‌న్ సార్డా, తాండూరు శాఖ అధ్య‌క్షులు బ్రిజ్ మోహ‌న్ బూబ్‌లు మాట్లాడుతూ
స‌మాజం దాత‌ల స‌హాకారంతో వేస‌విని దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌ల కోసం ఉచితంగా మ‌జ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వేస‌విలో ప్ర‌జ‌ల ఉప‌శ‌మ‌నానికి మ‌జ్జిగ‌ను పంపిణీ చేయ‌డం గోప్ప సేవా కార్య‌క్ర‌మం అని అభివ‌ర్ణించారు. వేస‌వి కాలం ముగిసే వ‌ర‌కు ఈ మ‌జ్జిగ పంపిణీ కేంద్రాన్ని కొసాగిస్తామ‌న్నారు. శ‌నివారం స‌మాజం స‌భ్యులు ర‌మేష్ చంద్ర బూబ్ స‌హాకారంతో దాదాపు 1000 మందికి ఉచితంగా మ‌జ్జిగ‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించే మ‌జ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచ్ కార్య‌ద‌ర్శి కిష‌న్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు కుంజ్ బిహారి సోని, మాజీ అధ్య‌క్షులు రామానుజ్ దాస్ సోని, స‌భ్యులు సూర్య‌ప్ర‌కాష్ సోమాని, ప‌వ‌న్ సోని, దినేష్ ప‌ర్తాని త‌దిత‌రులు పాల్గొన్నారు.