అన్ని వర్గాలకు సర్కారు ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్ని వర్గాలకు సర్కారు ప్రాధాన్యం
– రంజాను సంతోషంగా జరుపుకోవాలి
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో సర్కారు అన్ని వర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని యాలాల‌, బ‌సీరాబాద్‌, తాండూరు తహసీల్దార్ కార్యాలయాల‌లో ముంస్లింకు రంజాక్ కానుకల కిట్ల పంపిణీ నిర్వ హించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజరై కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు అన్ని వర్గాల వారికి, మతాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో ఈ ఘనత తెలంగాణ రాష్ట్రం. సీఎం కేసీఆర్ కే దక్కిందని. అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు క‌రుణ అజ‌య్ ప్ర‌సాద్, బాలేశ్వ‌ర్ గుప్త‌, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీ‌నివాస్‌రెడ్డి, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వన్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల దీపా నర్సింలు, తాండూరు వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.