ఎమ్మెల్సీ వ‌స్తున్నాడు..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ప‌ల్లె ప‌ల్లెకు వ‌స్తున్న ప‌ట్నం
– రేపు బ‌షీరాబాద్ మండ‌లంలో ఎమ్మెల్సీ ప‌ర్య‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ల్లె ప‌ల్లె ప‌ర్య‌ట‌న ఉత్స‌హాంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తాండూరు మండ‌లంలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి శనివారం బ‌షీరాబాద్ మండ‌లంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మండ‌లంలోని రెడ్డి ఘ‌ణాపూర్, మంత‌ట్టి, కాంశాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ర్య‌టించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌ర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్ర‌తినిధులు హాజ‌రు కావాల‌ని ఎమ్మెల్సీ వ‌ర్గీయులు తెలిపారు. తాండూరు మండ‌లంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ర్య‌ట‌నకు అనూహ్య స్పంద‌న ల‌భించింది.