ఇంటి సమస్య పరిష్కరించలేదని..
– అర్దనగ్నంగా వృద్ధుడు వినూత్న నిరసన
– తలకొర్వితో వీదుల్లో ప్రదర్శన
దర్శిని ప్రతినిధి: తన ఇంటి సమస్యను పరిష్కరించలేదని వికారాబాద్ జిల్లాలో ఓ వృద్ధుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. అర్దనగ్నంగా చేతిలో తలగోరివి పట్టుకొని.. నొదుటిపై రూపాయి బిళ్ళ పెట్టుకొని.. జిల్లా కేంద్రంలోని రామయ్య గూడ రోడ్డు నుంచి ప్రధాన రోడ్ల మీదుగా నిరసన ప్రదర్శించాడు. కేసీఆర్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించాడు. వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న కృష్ణ 73 సంవత్సరాల వృద్ధుడు. పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టు ప్రదక్షణలు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తానని వృద్ధుడు తెలిపాడు.

