రేపు పెద్దేముల్‌లో సునీతమ్మ పర్యటన

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు పెద్దేముల్‌లో సునీతమ్మ పర్యటన
– అభివృద్ధి ప‌నుల ప్రారంభం, శంకుస్థాప‌న
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : పెద్దేముల్ మండ‌లంలో రేపు వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. శుక్ర‌వారం మండ‌ల కేంద్రంతో పాటు మండ‌లంలోని రేగొండి, మంబాపూర్, గాజీపూర్‌, రుద్రారం, మారేప‌ల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌న చేయ‌నున్నారు. రేగొండిలో మురుగు కాలువ ప్రారంభం, మంబాపూర్ లో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన, గాజిపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనాన్నీ ప్రారంభం, పెద్దేముల్ మండల కేంద్రంలో జడ్పి అతిథి గృహం, షాపింగ్ కంప్లెక్స్, సీసీ రోడ్డు పనులను ప్రారంభం, రుద్రారంలో సీసీ రోడ్డు, మారేపల్లి నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ని ప్రారంబించ‌నున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనాల‌ని మండ‌ల నేత‌లు విజ్ఞ‌ప్తి చేశారు.