నో డౌట్ నేనే పోటీ చేస్తా..!
– బరిలో నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
– మంచం మీద ఉన్నా బరిలో ఉంటా
– 18 నుంచి మన ఊరు – మన కాంగ్రెస్
– కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి డౌట్ లేకుండా వంద శాతం కాదు వెయ్యిశాతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ తెలంగాణ ఉపాధ్యక్షులు, ఇంచార్జ్ ఎం. రమేష్ మహా రాజ్ స్పష్టం చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఎం.రమేష్ మహారాజ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఒక్కసారి ఆదరించాలన్నారు. గతంలో అనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నానని, ఈ సారి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఈసారి మాత్రం మంచం మీద ఉన్నకూడా పోటీ చేస్తానని అన్నారు. ఇందులో అనుమానం లేదని, వంద కాదు వెయ్యి శాతం పోటీ చేసి తీరుతానని, అధిష్టానం తనకే టిక్కెట్లు ఇస్తుందని ధీమా వ్యక్తం చే గెలిస్తే మాజీ మంత్రి మాణిక్ రావు, చందు మహారాజ్ ల స్ఫూర్తితో వారి సేవలకు మించి పనిచేస్తాన్నారు. అనారోగ్యంతో మంచం మీద ఉన్నా కూడ పోటీ చేసి తీరుతానన్నారు. ఈ ఒక్కసారికి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పార్టీలో పనిచేసేవారికి మాత్రమే టిక్కెట్టు వస్తుందని, పార్టీలో ఉంటూ వ్యతిరేకతకు పాల్పడితే చర్యలు తప్పవని పార్టీ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈనెల 18 నుంచి తాండూరు నియోజకవర్గంలో మన ఊరు- మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో, గ్రామంలో పర్యటించి సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు డిక్లరేషన్ ను పకడ్బందీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ జెర్సీటీసీ ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి. సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

