దళితబంధుతో ఆర్థిక చేయూత
– లబ్దిదారులు స్వయం ఉపాధిని పొందాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పెద్దేముల్ మండలంలో లబ్దిదారునికి ట్రాక్టర్ అందజేత
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకంతో కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఖానాపూర్లో లబ్దిదారునికి మంజూరైన ట్రాక్టర్ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న దళితులను ఉన్నతంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ దళితబంధును పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. దళిత లబ్దిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో విడతల వారిగా దళితబంధు కింద అర్హులైన లబ్దిదారులందరికి ప్రయోజనం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, సర్పంచులు రాములు, ద్యావరి నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, మహిళ నాయకురాలు శకుంతల తదితరులు పాల్గొన్నారు.



