రేపు జిల్లాలో జాబ్ మేళా

కెరీర్

రేపు జిల్లాలో జాబ్ మేళా
– అర్హులు ఎవ‌రంటే..?
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలో రేపు జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి క‌ల్ప‌న అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గురువారం ఉద‌యం 10-30 గంట‌ల‌కు స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాల‌యం, ఐటీఐ కార్యాల‌యం సుభాష్ న‌గ‌ర్ కాల‌నీలో ఈ జాబ్ మేళా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఆస్ట‌ర్ ఫార్మ‌సీ ప్రైవేటు కంపెనీలో 200 ఉద్యోగాల‌కు జాబ్ మేళా జ‌రుగుతుంద‌న్నారు. ఫార్మ‌సిస్ట్‌, ఫార్మసీ అసిస్టెంట్ ట్రైనీస్ పోస్టుల‌ను ఢీ-ఫార్మ‌సీ, బీ-పార్మ‌సీ, ఎం-ఫార్మ‌సీ, 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ చ‌దివిన అభ్య‌ర్థులు పోస్టుల‌కు అర్హుల‌ని స్ప‌ష్టం చేశారు. పూర్తి వివ‌రాల‌కు బాల్‌రాజ్(8867765908), ఎం.మ‌హేష్‌(8867765909)ల‌కు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని, జిల్లాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన సంబంధిత నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.