ప‌రీక్షా కేంద్రాల‌లో సీసీ నిఘా..!

కెరీర్ తాండూరు వికారాబాద్

ప‌రీక్షా కేంద్రాల‌లో సీసీ నిఘా..!
– ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– విద్యార్థులు అరగంట ముందే రావాలి
– మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రెండేళ్ల తరువాత నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల‌లో సీసీ నిఘా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. శనివారం తాండూరు పట్టణం. మండలంలో పది పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలలో సీసీ కెమెరాలను అమర్చారు. ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల గత రెండు విద్యాసంవత్సరాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయామన్నారు. రెండేళ్ల తరువాత నిర్వ‌హిస్తున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్షలను పారదర్శంగా.. సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా తాండూరు మండలం, తాండూరు పట్టణంలోని పరీక్ష కేంద్రాలలోని చీఫ్ ఎగ్జామ్ సూపరిండెంట్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మరోవైపు తాండూరు పట్టణం, మడలంలో మొత్తం 2315 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 21 మంది నిర్వహణ అధికారులు, 150 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12-45 గంటలకు కొనసాగుతాయని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు. అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే అనుమతించడం కుదరదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా… పకడ్బందీగా పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నియల్ బృందం ప్రతినిధిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.