వినాయక నిమజ్జనం ప్రశాంతం..!

తాండూరు రాజకీయం వికారాబాద్


వినాయక నిమజ్జనం ప్రశాంతం..!
– సహకరించిన అందరికి కృతజ్ఞతలు
– తాండూరు హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి ఆదివారం నిమజ్జనానికి తరలించారు.
kvcs
ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నిమజ్జనానికి వినాయకులను యాలాల మండలం కోకట్ కాగ్నానదికి తరలించేందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున విశేష కృషి చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాతంగా జరుపుకునేందుకు సహకరించడంపై హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు స్వప్న పరిమళ్, గౌరవాధ్యక్షులు రాజుగౌడ్ల తరుపున ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు వినాయక ఉత్సవ సమితి సభ్యులకు, పట్టణ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు సంతోష్ కుమార్, నగేష్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి….

వినాయక.. సెలవికా..!!