అభివృద్ధిపై ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేది లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధిపై ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేది లేదు
– తాండల అభివృద్ధికి ప్రాధాన్యం
– వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ప‌ర్స‌న్ సునీతారెడ్డి
– బ‌షీరాబాద్‌లో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ర్య‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అభివృద్ధి విష‌యంలో ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేది లేద‌ని వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌లంలో జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితా మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ర్య‌టించారు. మండలంలోని వాల్యనాయక్ తండాలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, దామర్ చెడ్ గ్రామంలో రూ.12 లక్షల నిధులతో సీసీ రోడ్లను ప్రారంభించారు.
వాల్యానాయ‌క్ తాండాలో సునితమ్మకు గిరిజనులు వారి సంప్రదాయంతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. సునితారెడ్డి కూడ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి గిరిజ‌నుల‌ను ఉత్స‌హా ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా సునితారెడ్డి మాట్లాడ‌తూ బ‌షీరాబాద్ మండలానికి మూడేళ్ళలో రూ.7 కోట్లు నిధులు మంజూరు చేశాం. ఇంకా మంజూరు చేస్తామ‌న్నారు. అభివృద్ధి విషయంలో ఎవరికి భయపడేది లేదు. అభివృద్ధికి ఎవరు ఆటంకం కలిగించిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజ‌న తాండాల అభివృద్ధికి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పి సీఈఓ జనాకీరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సీనియర్ నాయకులు కారణం పురుషోత్తం రావు, రవిగౌడ్, శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మానిక్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బన్సీలాల్, శ్రావణ్, బిర్కట్ రఘు, రామకృష్ణ, ఎంపీడీఓ, ఎమ్మార్వో , అధికారులు పాల్గొన్నారు.