గ‌జ‌రాజుకు త‌ప్పిన ప్ర‌మాదం..!

జాతీయం తెలంగాణ

గ‌జ‌రాజుకు త‌ప్పిన ప్ర‌మాదం
– స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించిన రైల్వే పైలెట్
ద‌ర్శిని ప్ర‌తినిధి: రైలుకు ఎదురొస్తున్న గ‌జ‌రాజు ప్రాణాల‌ను ఇద్ద‌రు రైల్వే పైలెట్లు కాపాడారు. సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘ‌ట‌న‌లోని రైల్వే డ్రైర్ల‌ను ప్ర‌జ‌లు ప్ర‌శ‌సిస్తున్నారు. వేస్ట్ బెంగాల్‌లో జ‌రిగిన ఈ సంఘటనను అలిపుర్దార్ డివిజన్ NF రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేశారు. వేస్ట్‌ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని నాగరకత-చల్సా మధ్య జరిగింది. వీడియోలో చూసినట్లుగా ఓ ఏనుగు రైల్వే ట్రాక్‌కి దగ్గరగా నడుస్తోంది. ట్రాక్‌ దాటడానికి ప్రయత్నిస్తు ఉంటుంది. వెంటనే అప్రమత్తమైన ట్రైన్‌ డ్రైవర్లు సమయానికి బ్రేకులు వేయడంతో రైలు స్లో అవుతుంది. తర్వాత రైలు మెల్లగా ముందుకు కదులుతున్నప్పుడు ఏనుగు ట్రాక్‌ నుంచి దూరంగా అడవిలోకి ప్రవేశించడం మనం గమనించవచ్చు. ఇది కాస్త సోష‌ల్ మీడీయాలో వైరల్ కావడంతో అప్రమత్తంగా వ్యవహరించిన ట్రైన్‌ డ్రైవర్లను అందరు అభినందిస్తున్నారు. ఈ వీడియో చూసిన ఒక వినియోగదారు ఇలా రాశాడు. “ఇది ప్రశంసనీయమైన పని. చాలా ధన్యవాదాలు. నేను అలిపూర్దుర్ నుంచి వచ్చాను చాలా ఏనుగులు చనిపోయిన ప్రమాదం నాకు ఇంకా గుర్తుంది. నిజానికి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గొప్ప ఉద్యోగం సర్ అని అభినందించాడు. ఇదే వీడియోపై మ‌రో వ్య‌క్తి ఏనుగు విలువైన ప్రాణాలు కాపాడినందుకు డ్రైవ‌ర్ల‌కు చాలా ధన్యవాదాలు అని తెలిపాడు. ఇంకా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను లైక్‌, షేర్స్ చేస్తున్నారు.