పశువుల అక్రమ రవాణాకు చెక్..!

క్రైం తాండూరు వికారాబాద్

పశువుల అక్రమ రవాణాకు చెక్..!
– అంతారం, కొత్లాపూర్‌లో చెక్‌పోస్టుల ఏర్పాటు
– పరిశీలించిన తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధిః తాండూరు ప్రాంతంలో పశువులు(గోవులు, లేగదూడల) అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రెండు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు.

మంగళవారం తాండూరు మండలం అంతారం, కొత్లాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్‌ పోస్టులను తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ దృష్ట్యా అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తీసుకునేందుకు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బక్రీద్‌ పండగ ముగిసే వరకు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా పశువులను తరలిస్తే ఉపేక్షించే అవకాశం ఉండదని హెచ్చరించారు. కావున ఇందుకు అందరు సహకరించాలని సూచించారు. డీఎస్పీ వెంట పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.