అందరివాడు అంబేద్కర్
– ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
– బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు
– అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి తరలిన నేతలు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగా నిర్మాత అందరివాడని బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు నీరటీ హన్మంతు అభివర్ణించారు. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ చెంతనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభంతో పాటు దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ప్రారంభానికి శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే నాయకత్వంలో బీసీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు ఆధ్వర్యంలో పాత తాండూరుకు చెందిన నేతలు, ప్రజలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు.
పాత తాండూరు అంబేద్కర్ నుంచి ఆర్టీసీ ద్వారా ప్రత్యేకంగా కేటాయించిన బస్సులో నేతలు, ప్రజలు, యువకులను తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారుల సమక్షంలో నీరటి హన్మంతు ఆధ్వర్యంలో వాళ్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నీరటి హన్మంతు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా డా.బీఆర్ అంబేద్కర్ అందరికి హక్కులు కల్పించారని అన్నారు. అందరు స్వేచ్చాయుతంగా జీవించేందుకు అవకాశం కల్పించి అందరివాడుగా నిలిచారని అన్నారు. అంతటి గొప్ప నాయకుడు అంబేద్కర్ విగ్రహాన్ని దేశీయంగానే తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, పాత తాండూరు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

