అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్ కన్నుమూత
– బ్రెయిన్ ట్యూమర్‌తో చికిత్స పొందుతు మృతి
తాండూరు, దర్శిని ప్రతినిధిః అనారోగ్యంతో బాధపడుతున్న అంగన్ వాడి టీచర్ కన్నుమూసింది. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డు వడ్డెర గలి అంగన్వాడి కేంద్రం -2 లో అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తున్న స్వరూప రాణి (36) గత నాలుగైదు రోజుల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని పలు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని శ్రీకృష్ణ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు అమ్మాయిలు భర్త కిరణ్ కుమార్ ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే అంగన్వాడీ టీచర్ స్వరూప రాణి మృతి పట్ల తోటి అంగన్వాడి టీచర్లు సిబ్బంది తీవ్ర సోకసముద్రంలో మునిగి పోయారు. మృతి వార్తను తెలుసుకున్న ఐసిడిఎస్ తాండూరు సిడిపిఓ రేణుక సూపర్వైజర్ అరుణ టీచర్లు ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించి అంగన్వాడి టీచర్ అకాల మృతి పట్ల తోటి టీచర్లు అధికారులు తీవ్ర విచారణ వ్యక్తం చేసి ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.



