యోగాసనాల హేలా..!
– తాండూరులో యోగా దినోత్సవం
– ఆసనాలు వేసిన అధికారులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంతర్జాతీయ యోగా దినోత్సవం తాండూరులో కోలాహలంగా జరిగింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో యోగాసనాల హేల సంతరించుకుంది. శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవైశ్య, వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరుపుకున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విలియం మూన్, సెయింట్ మార్క్స్ పాఠశాల ఆవరణలో మార్నింగ్ వాకర్స్ యోగాసనాలు వేశారు.

అంతేకాకుండా తాండూరు మున్సిఫ్ కోర్ట్ ఆవరణలో ఆవరణలో యోగ గురువులు నరేందర్(సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపాల్) గాజుల సిద్ధిరామేశ్వర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది యోగ ఆసనాలు వేశారు. చిన్నారులు, యువకులు, పెద్దలు యోగా విశిష్టతను తెలిపే పలు రకాల ఆసనాలను వేశారు. చిన్నారులు, యువకులతో పాలు పలువురు పెద్దలు కూడా వారికి ధీటుగా యోగాసనాలు వేసి అబ్బుర పరిచారు.
ఈ సందర్భంగా పలువులు మాట్లాడుతూ యోగా మన పూర్వీకులు అందరికి అందించిన గొప్పవరం అని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఆర్యవైశ్య, వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పినమోని శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు పి. రామిరెడ్డి, కె, గోపాల్ ఎడ్రామీ విశ్వనాథ్,బాలకృష్ణ, జిలాని, కోర్ట్ సూపరింటెండెంట్, శ్రీనివాస్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

