బీసీ భ‌వ‌న్‌కు ముంద‌డుగు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ భ‌వ‌న్‌కు ముంద‌డుగు
– త్వరలోనే స్థ‌లం కేటాయింపు
– ప‌రిశీలించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం చాలా కాలంగా డిమాడ్ చేస్తున్న బీసీ స‌మీకృత భ‌వ‌న్‌కు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొర‌వ‌తో ముందడుగు ప‌డ‌నుంది. ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వనాథ్ గౌడ్, సాయిపూర్ నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాసచారీ లతో పాటు బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, షుకూర్ లతో కలిసి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతాశిశు ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న భూమిని ప‌రిశీలించారు. బీసీ సమీకృత భవనంకు అనువుగా ఉంద‌ని నాయకులు భావించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ సమీకృత భవన్ ను నిర్మించాలని చాలా కాలంగా బిసి సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని గుర్తుచేశారు. పార్టీకి చెందిన బీసీ నేతలు సైతం తాండూరులో బిసి భవన్ అవసరంను అనునిత్యం గుర్తుచేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా తాండూరులో బిసి సమీకృత భవన్ నిర్మాణంకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే బిసి సమీకృత భవన్ కు భూమిని కేటాయించేలా చూడాలని పార్టీ నేతలు సాయిపూర్ నర్సింలు, రాజుగౌడ్ లకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచించారు. త్వరలో బిసి భవన్ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరులో బీసీ సమీకృత భవన్ నిర్మాణంకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చూపిస్తున్న చొరవపై బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ సంతోషం వ్య‌క్తం చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.