కరోనా కొత్త లక్షణాలు
– అవి కనిపిస్తే అప్రమత్తం తప్పనిసరి
– జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
దర్శిని డెస్క్: రెండేళ్లు దాటినా కరోనా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతున్నది. వైరస్‌కు అంతమెప్పుడో నిపుణులు సైతం ఏమీ చెప్పలేది పరిస్థితి ఎదురవుతున్నది. ఇటీవల భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న కేసుల మధ్య ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో వృద్ధులకు, పిల్లల్లో రోగనిరోధకత, కేసుల పెరుగుదలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. అదే సమయంలో వైరస్‌లోని ఉత్పరివర్తనాల కారణంగా కొత్త వేరియంట్ల బారినపడిన వారిలో అనేక కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా కొత్త లక్షణాలు ఏంటంటే..?
సాధారంగా కొవిడ్ సోకిన నుంచి ఉంటుందని, సాధారణంగా.. మూడు, ఐదు రోజుల మధ్య కూడా ఉంటుంది. అలాగే మోస్తరు నుంచి తీవ్రంగా జ్వరం ఉంటుంది. తలనొప్పి చాలా రోజులు నుంచి కొనసాగితే తీవ్రంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరిలో కండరాల నొప్పి సమస్య సైతం సాధారణంగా కనిపిస్తుందని తేలింది. ప్రత్యేకించి ఒమిక్రాన్ వెబ్‌లో విక్షలక్షణమైన లక్షణంగా పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తులు కండరాల నొప్పి ఉంటుందని, సమస్య నిరంతరం కొనసాగుతుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా భుజాలు, కాళ్లులో నొప్పి ఉంటుందని, కండరాల నొప్పితో పాటు విపరీతమైన అలసట, బలహీనంగా ఉంటుందని, ఈ లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నిపుణులు అప్రమత్తం..
ఓ వైపు కొవిడ్-19 ముప్పు కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరం ఒక్కటే కొవిడ్‌కు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి సమయంలో ఇప్పటికే తీవ్రమైన సమస్యలున్న వ్యక్తులు సరైన వైద్య పరీక్షలు, చికిత్స తీసుకోవడం లేదని నిపుణులు గుర్తించారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ కొత్త లక్షణాలను అర్థం చేసుకోవడంతో పాటు ఇతర వ్యాధుల తీవ్రతపై సైతం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ల కారణంగా లక్షణాల్లోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు.



