వాసవీ మాత నమోస్తుతే..!
– నగరేశ్వరంలో మహా హారతి, నిత్య ప్రసాద సేవ
– ప్రారంభించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవీ మాతను దేవీ నమోస్తుతే అంటూ దర్శించుకున్నారు. తాండూరు పట్టణం నగరేశ్వరాలయంలో వెలసిన శ్రీ వాసవి మాత సేవలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ భక్తులు తరించారు.
సోమవారం ఆలయ చైర్మన్ కుంచెం మురళీధర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మహా హారతి, నిత్య ప్రసాద సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సహాకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, వార్డు కౌన్సిలర్ సింధూజ గౌడ్, ఆర్యవైశ్య సంఘం, మహిళ సంఘం సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా హారతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నిత్య ప్రసాద సేవకు అందరు తోచిన తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళ సంఘం పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



