రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలి

తాండూరు వికారాబాద్

రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలి
– డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాలి
– ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్రభుత్వం రేష‌న్ డీల‌ర్ల‌కు క‌మీష‌న్‌ను పెంచి ఆదుకోవాల‌ని తాండూరు మండ‌ల‌, ప‌ట్ట‌ణ రేష‌న్ డీల‌ర్లు డిమాండ్ చేశారు. కేంద్ర‌, రాష్ట్ర రేష‌న్ డీల‌ర్ల యూనియ‌న్ పిలుపు మేర‌కు సోమ‌వారం తాండూరు రేష‌న్ డీల‌ర్ల సంఘం ఆధ్వ‌ర్యంలో స్థానిక త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం అధ్యక్షులు ఠాకూర్ రమేష్, ప్రకాష్ లు మాట్లాడుతూ చాలీచాలని కమిషన్లతో కాలం వెళ్లే తీస్తున్నా రేషన్ డీలర్లకు కమిషన్ పెంచి ప్రభుత్వ ఆదుకోవాలని అన్నారు. క్పింటాళుకు రూ. 440 ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రేషన్ డీలర్లకు ఉద్యోగాలు భద్రత కల్పించాలని, కరోనా సమయంలో మృతి చెందిన డీలర్లు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌రం డిప్యూటీ తాసిల్దార్ ధనుంజయకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల రేషన్ డీలర్లు బంటారం మల్లేశం, గాజుల శాంతుకుమార్, కోట్రిక వీరేశం, మల్లికార్జున్, సిద్దప్ప, మహమ్మద్ ఇక్బాల్, శైలేష్, గౌరీ శంకర్, విష్ణువర్ధన్, ముంషాద్, మొయిజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.