టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ‌ నేత‌ల‌కు ప‌ద‌వులు

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ‌ నేత‌ల‌కు ప‌ద‌వులు
–  ప‌ట్ట‌ణ‌ ఉపాధ్య‌క్షులుగా చెస్ బ‌స‌ప్ప‌
– బీసీ సెల్ ఉపాధ్య‌క్షులుగా కోటం ప్ర‌సాద్
– నియ‌మ‌కాల‌ను అంద‌జేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో టీఆర్ఎస్ నాయ‌కులకు ప‌ట్ట‌ణ కార్య‌వ‌ర్గంలో ప‌ద‌వులు వ‌రించాయి. టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ఉపాధ్యక్షులుగా చెన్ బసప్ప, బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా కోటం ప్రసాద్‌లు ఎన్నికయ్యారు. బుధవారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ ప థకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన విఠల్ నాయక్, అధికార ప్రతినిధి రాజుగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మహిళ కన్వినర్ శకుంతల, మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.