తాండూరులో కరోనా కలవరం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

తాండూరులో కరోనా కలవరం
– నాలుగు రోజుల్లో 9 కేసుల నమోదు
– హోం ఐసోలేష‌న్‌లో బాధితుల చికిత్స‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశంలో, రాష్ట్రంలో మళ్లీ రేగిన కరోనా కలవరం తాండూరుకు పాకింది. రోజుకో కేసు చొప్పున కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెల 4వ తేది నుంచి గురువారం వరకు 9 కేసులు నమోదయ్యాయి. సోమవారం 4, మంగళవారం 2, బుధవారం 2. గురువారం 1 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. అంతకుముందు గత నెల 24న 1, 27న 2 కేసులు నమోదు కాగా ఈ వారం నుంచే ప్రతి రోజూ కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. క‌రోనా వైర‌స్ బారిన బాధితులు హోం ఐసోలేష‌న్‌లోనే చికిత్స పొందుతున్నారు. మ‌రోవైపు జిల్లా ఆసుప‌త్రిలో ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి అనుగుణంగా ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం కూడ ఉండడంతో ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. అవసరమైతే మాస్కులు తప్పక ధరించాలని చెబుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు.