ఎమ్మెల్సీగా ఫ్రో.కోదండరాం..!
– గవర్నర్ కోటాలో గ్రీన్ సిగ్నల్
– మరో ఎమ్మెల్సీగా అమీర్ అమీర్ అలీఖాన్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ల నియామకం అయ్యారు. గవర్నర్ కోటాలో వీరికి పదవిని అప్పగించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ అందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకానికి గవర్నర్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.
ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు పంపించగా.. గవర్నర్ ఆమోదించారు. మరోవైపు ఫ్రోఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు కోదండరాం సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఫ్రోఫెసర్ కోదండరాం ఎంపిక కావడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

