సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌ 
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
– ల‌బ్దిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద‌జేత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సీఎం ఆర్ఎఫ్ ప‌థ‌కం పేద‌ల ఆరోగ్యానికి అండ‌గా నిలుస్తోందని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. బ‌షీరాబాద్ మండలంకు చెందిన నర్సింగ్‌కు రూ. 60వేలు, కొర్విచేడ్‌కు చెందిన అశోక్‌కు రూ. 56 వేలు, తాండూరు ప‌ట్ట‌ణంకు చెందిన నాగమణికి రూ.60వేలు, యాలాల మండ‌లం అగ్గ‌నూర్ మ‌ల్‌రెడ్డిప‌ల్లికి చెందిన మ‌హిపాల్‌కు రూ. 38వేల 500లు మంజూర‌య్యాయి. బుధ‌వారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, జిల్లా ప్రణాళిక మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, బషీరాబాద్ మండలం PACS ఛైర్మెన్ వెంకట్ రామ్ రెడ్డి, మాజీ PACS ఛైర్మెన్ సిద్రలా శ్రీనివాస్, సీనియర్ నాయకులు బీదర్ రాజ్ శేకర్, రాష్ట్ర యూత్ కార్యదర్శి రఘు అశోక్ ముదిరాజ్ ,శ్రీకాంత్ రెడ్డి, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, మంగలి శ్రీనివాస్, రంజిత్, అశోక్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.