సేవా మూర్తి భావనోళ్ల శంకర్ యాదవ్
– తాండూరులో అట్టహాసంగా జన్మదిన వేడుకలు
– జయంతి సందర్భంగా విభిన్న సేవా కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వయంకృషితో ఎందరికి తాండూరు వాసులకు ఆదర్శంగా నిలిచిన సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్‌యాదవ్‌ను పలువురు ప్రజలు సేవా మూర్తిగా అభివర్ణించారు. ఆదివారం తాండూరులో భావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కోకట్ రోడ్డు మార్గంలోని సాయిమందిరంలో సాయినాథుని, పాత తాండూర్ లోని మైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనమ్మ ఆలయాభివృద్ధికి శంకర్ యాదవ్ విరాళం అందజేశారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువులకు బెడ్స్ పంపిణీ చేశారు. పట్టణంలోని కన్య పాఠశాల ఆవరణలో కరాటే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హోటల్ హిమాలయలో పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ఆవరణలో వికలాంగుల కుటుంబాలకు చేయూత అందించారు. అదేవిధంగా పట్టణంలోని తులసి గార్డెన్ లో యాదాద్రి వైకుంఠ దామం పుస్తక ఆవిష్కరణతో పాటు సాయి పుత్ర హోమ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ గారి ఉన్నతమైన సేవలను కొనియాడుతూ తులసి గార్డెన్ లో ఆడియో సిడి విడుదల చేశారు.

అనంతరం మనసున్న మహారాజు శంకర్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా తులసి గార్డెన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం శంకర్ యాదవ్ చేత కేక్ కటింగ్ చేయించారు.



శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, నేతలు
————————————————————
మరొవైపు జన్మదినం జరుపుకున్న భావనోళ్ల శంకర్ యాదవ్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. తులసీ గార్డెన్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, వికారాబాధ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్‌చారి, మాజీ డీపీసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, పోలీసు అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున హాజరై శంకర్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ స్నేహితులు కందుకూరి రాజ్ కుమార్, జొన్నల వినోద్, పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్‌రెడ్డి, బంటు మల్లప్ప, ప్రభాకర్‌గౌడ్, మనోహర్ యాదవ్, ప్రెమ్ కుమార్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


