తాండూరు ‘పుర’అభివృద్దే లక్ష్యం..!
– పార్టీలకతీతంగా వార్డులకు నిధులు
– ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి పురోగతి పరచడమే లక్ష్యంగా అందరు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కు చెందిన కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై తీసుకోబోయే అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిల సహాకారంతో తాండూరుకు అధిక నిధులు సాధించుకుందామన్నారు. మున్సిపల్లో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు నిధులు కేటాయించి అభివృద్ధి పరుచుకుందామన్నారు. తాండూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అస్లాం. ఆసిఫ్, సిందూజ, సంగీత ఠాకూర్, బొంబీనా, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ చైర్మన్ సలీం, నాయకులు సుమిత్ గౌడ్, నరేందర్ గౌడ్, ఎర్రం శ్రీధర్, కోఆప్షన్ సభ్యురాలు సారంగా తదితరులు ఉన్నారు.



