కాంగ్రెస్ పార్టీవి దౌర్జన్య రాజకీయాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీవి దౌర్జన్య రాజకీయాలు
– తాండూరుకు ఫ్యాక్షన్ చూపిస్తున్న ఎమ్మెల్యే
– సర్పంచులు, వార్డు సభ్యులను బెదిరించడం హస్యాస్పదం
– 100 సీట్లు సాధించామనడం సిగ్గుచేటు
– ఎమ్మెల్యే దుకాణం బంద్ చేసుకోవాల్సిందే
– జెడ్సీ ఎన్నికల్లో తేల్చుకుందాం.. ఇదే మా సవాల్
– బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల జోలికొస్తూ ఊరుకునేది లేదు
– మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరాచక.. దౌర్జన్యం.. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బెదిరింపు, ఆరాచకాలు, దౌర్జన్య రాజకీయాలు పాల్పడుతోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు సర్పంచులు. ఉప సర్పంచులను బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని అన్నారు.

అల్లాపూర్, ఓగిపూర్ సర్పంచు, ఉపసర్పంచులను పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. వార్డు సభ్యులను కూడా పార్టీలో చేర్చుకోవడం హస్యాస్పదమన్నారు. బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాల్లో ఇదే రాజకీయాలు చేశారని అన్నారు. బ షీరాబాద్ మండలం కుప్పన్ కోట్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడడం హేయమని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలు ఉన్న రవి ందర్ గౌడ్ స్వగ్రామం సంగెంకలాన్, పెద్దేముల్ మండల కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ ఇలాఖాలో, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్ ఉన్న తాండూరు జినుగుర్తి గ్రామంలో శరణు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారని అన్నారు.

బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచాయంటూ బీఆర్ఎస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి ఇదే ఉదహరణలు అంటూ వివరించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మహేందర్ రెడ్డి మాదిరిగా భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వము, నిధులు ఇవ్వమని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 స్థానాలు గెలుపొందిదని చెప్పుకోచ్చారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం 100 సీట్లు గెలుపొందానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ గారడి లెక్కలు ఎంటో అర్థం కావడం లేదని అన్నారు. ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం లేకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అన్నారు. పార్టీ గుర్తులు లేకుండానే ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారని అన్నారు.


వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై జరుగుతాయని. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపునుంచి నాలుగు జెడ్పీటీసీ సీ, అత్యధిక స్థానాలు ఎంపీటీసీలను గెలిపించుకుని జెడ్సీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుని బీఆర్ఎస్ మద్దతు సర్పంచులకు నిధులు సాధించుకుంటామని భరోసా అందించారు. వచ్చే ఎన్నికలతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అవబోతోందని.. ఆయన తిరుమలాపూర్ వెళ్లిపోవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో-ఆరచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అలా కాదని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి. బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల రాంలింగారెడ్డి తదితరులు ఉన్నారు.


ఇదికూడా చదవండి…

హస్తంలో సంబరాలు..!