తారాస్థాయికి ఒప్పంద రాజ‌కీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

తారాస్థాయికి ఒప్పంద రాజ‌కీయం
– పీఠం ద‌క్కించికునేందుకు ప‌ట్లోళ్ల ప‌ట్టు
– మంత్రులు, ఎంపీల‌తో దీపా నర్సింలు భేటీ
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌మ‌క్షంలో చ‌ర్చ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పుర‌పాల‌న రాజ‌కీయాలు హీటెక్కాయి. చైర్ ప‌ర్స‌న్ పీఠానికి చేసుకున్న ఒప్పంద రాజ‌కీయాలు తారాస్థాయికి చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. చైర్ ప‌ర్స‌న్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు వైస్ చైర్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు ప‌ట్టు బిగిస్తున్న‌ట్లు తాజా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాండూరు పురపాలక సంఘం 2020 లో జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా మరియు తాండూరు మున్సిపాలిటీలలో టీఆరెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా జిల్లా మొత్తం టీఆరెస్ చైర్మన్ సీట్లను కైవసం చేసుకునే దిశగా క్రియాశీల ఇంచార్జిలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు శ్రీనివాస్ యాదవ్,సబితాఇంద్ర రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మహేందర్ రెడ్డి, జడ్పీచైర్మన్ సునీత రెడ్డి గార్లను నియమించి వారికి ప్రత్యేక బాధ్యతలను అందించింది.

తాండూరు పురపాలక సంఘం చైర్ పర్సన్ గా తీవ్రపోటీ ఏర్పడడంతో తాటికొండ స్వప్న పరిమ‌ళ్ గుప్త‌, పట్లోళ్ల దీప నర్సింలు ఇద్ద‌రి మ‌ద్య రెండున్నర సంవత్సరల పదవికాలాన్ని ఎన్నికల ఇంఛార్జీలు, టీఆరెస్ పార్టీ కౌన్సిలర్ల సమక్షంలో ఒప్పందం కుదిర్చి ఇద్దరికి చేరి రెండున్నర సంవత్సరల పదవిని నిర్ణయించారు.

తాజాగా ఒప్పంద గ‌డువు ముగుస్తుండండంతో బెట్టు రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఒప్పందాన్ని సాధించుకునేందుకు ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పురపాలక సంఘం కౌన్సిలర్లతో క‌లిసి హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్ర రెడ్డి, ఎంపీ డా.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్ రావు,ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ గార్ల‌ను వేర్వేరుగా వారి నివాసలలో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి సమక్షంలో కలసి పట్లోళ్ల దీప నర్సింలు గారికి నిర్ణయించిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించలని తాండూరు పురపాలక సంఘం టీఆరెస్ పార్టీ కౌన్సిలర్లు వినీతిపత్రాలను అందజేశారు. దీనిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని, కుదిర్చిన ఒప్పందం ప్రకారం అందరూ కట్టుబడి ఉండాలని సానుకూలంగా స్పందించారు.

ఈ క్ర‌మంలో దీపా నర్సింలు గారికి అవకాశం కల్పిస్తామన్నారని వారు పేర్కొన్నారని నేత‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలతో పాటు కౌన్సిలర్లు శాదీపురం అశ్విణీ గుండప్ప, ఎర్రం వసంతా శ్రీధర్, ఎస్.లతా గౌడ్, సింధుజ నరేందర్ గౌడ్, సంగీతా ఠాకూర్, మేహారాజ్ బేగం, మంకల్ రాఘవేందర్, భీం సింగ్, అస్లాం,ముక్తర్ నాజ్, అసిఫ్ కో-ఆప్షన్ సభ్యులు సరంగా విజయ్, వెంకట్ రాం పవర్, తెరాస నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎస్.రాజు గౌడ్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధానకార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు శ్రీశైల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, డా.సంపత్ కుమార్, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, నరేందర్ గౌడ్, ఎర్రం శ్రీధర్, ఈర్షద్, సలీమ్, విజయ్, ఇంతియాజ్ బాబా, చంటి యాదవ్, సి.రవి, మహేశ్వర్ రెడ్డి, శివానంద్, జవీద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.