కాంగ్రెస్ నాయకుల దిగ్బందం
– ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో కాంగ్రెస్ నాయకులను పోలీసులు నిర్బంధించారు. కేంద్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు చలో ఈడీ కార్యాలయం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తాండూరు, తాండూరు రూరల్ పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. తాండూరు పట్టణంలో యాలాల మండల యూత్ అధ్యక్షులు మన్నన్, పట్టణ నాయకులు బాతుల వెంకటేశం, బాతుల భీంశంకర్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టణ పోలీస్టేషన్లో కట్టడి చేశారు. అదేవిధంగా తాండూరు మండలంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ కుమార్, ఎంపీటీసీ రాజకుమార్, శివకుమార్ లను అరెస్ట్ చేసి కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం తప్పదన్నారు.



