అందరిపై గణేషుని ఆశీస్సులుండాలి
– అన్నదానంలో భావనోళ్ల శంకర్‌యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముందు ముక్కుల వాడు వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని తాండూరు శ్రీ సాయిపుత్ర హోమ్స్, డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ ఆకాంక్షించారు. శనివారం తాండూరు పట్టణం 9వ వార్డులో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప శంకర్‌యాదవ్ సహాకారంతో బోనమ్మ గుడి వద్ద ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్ హాజరై మండపంలో కొలువుదీరిన వినాయకున్ని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు శంకర్ యాదవ్ చేతుల మీదుగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో అతలకుతలమైన పేదల జీవితాల్లో విష్నేషుడు సంక్షేమాన్ని నింపాలని అన్నారు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు అన్నదాన కార్యక్రమానికి హాజరైన శంకర్ యాదవ్‌ను టీఆర్ఎస్ నాయకులు బంటు మల్లప్ప శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి సాయిపూర్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, సాయిపూర్ యువకులు తదితరులు పాల్గొన్నారు.