మాట వినకుంటే ముట్టడే..!
– పట్లోళ్ల దీపా నర్సింలుకు పూర్తి మద్దతు
– రేండున్నరేళ్ల ఒప్పందాన్ని శిరసావహించాలి
– బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం
– ఒప్పందం నేర్పులో ఎమ్మెల్సీపై విశ్వాసం
– ఎమ్మల్యే నాయకత్వ బలోపేతానికి తోడ్పాటు
– సమావేశంలో ద్వజమెత్తిన బీసీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఒప్పందంలో మాట వినకుంటే ముట్టడి తప్పదని స్థానిక బీసీ నేతలు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీ మేరకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ బీసీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పబ్లోళ్ల దీపా నర్సింలు, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పద్దోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వివిధ మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుకు దక్కేలా పూర్తి మద్దతు అందజేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్ పర్సన్ పీఠంపై చైర్ ర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పదోళ్ల దీపా నర్సింలు మధ్య జరిగిన ఒప్పంద గడువు ఈనెల 26తో ముగిసిపోతుందని గుర్తుచేశారు. మంత్రులు, పార్టీ నేతల సమక్షంలో రెండున్నర ఏళ్ల ఒప్పందానికి కట్టుబడి పదవి నుంచి దిగిపోవాలన్నారు. చైర్ పర్సన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపా నర్సింలుకు అవకాశం కల్పించాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయం ముందు, చైర్ పర్సన్ నివాసం ముందు దర్నాలు, ఆందోళనలు చేస్తాన్నమారు. బీసీలకు ఇచ్చిన హామి నేరవేర్చకపోయినా.. బీసీలకు దక్కాల్సిన హక్కులపై అన్యాయం చేసినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్, ఎంఐఎం మద్య జరిగిన రెండున్న రేళ్ల ఒప్పందంను నెరవేర్చారని అన్నారు. తాజాగా కూడ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే విశ్వాసం ఉందన్నారు. బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తూ అందరివాడిగా నిలుస్తున్నారని అభివర్ణించారు. ఆయన నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా తోడ్పాటు అందించాలన్నారు. మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బొమ్మలాగా మారిపోయారని, ఆమె పరిపాలన అస్తవ్యస్థంగా మారిందని విమర్శిస్తూనే చైర్ పర్సన్ గా దీపా నర్సింలు పదవిని చేపడితే మున్సిపల్ ను అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ఎర్రం వసంత, సందుల లత గౌడ్, తాండూరు పార్టీ అధ్యక్షులు రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కొహిర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, కార్మిక విభాగం అధ్యక్షులు కె.గోపాల్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పరి మహేందర్, టీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్. సీనియర్ నాయకులు పాండు, యాలాల వైస్ ఎంపీపీ రమేష్, రాములు, తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, కరణ్ కోట్ ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, తాండూరు నాయకులు చెన్ బసప్ప, నరేందర్ గౌడ్, యువ నాయకులు చంటియాదవ్, ఇంతియాజ్, టైలర్ రమేష్, పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



