తాండూరును వీడను..!
– భయంతోనే ఆరోపణలు
– దుష్ప్రచారం చేసినా నమ్మరు
– నెక్స్ట్ ఎలెక్షన్స్ పోటీపై కీలక కామెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరును వీడేది లేదని, నాపై చేసిన దుష్ప్రచారం ఎవ్వరూ నమ్మరని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలోని జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు తనపై తాండూరు వదిలి వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వాళ్ళు భయపడి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాండూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. తాండూరును విడిచి పెట్టేది లేదని, తాండూరులోనే ఉంటానని స్పష్టం చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. మల్కాజగిరి, చేవెళ్ళతో పాటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రావఫ్, మసూద్, ఖవి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

