తాండూరు ప్రగతికి కృషి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– టీఆర్ఎస్‌లో సాయిపూర్ వాసుల చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రగతికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధితో రూపురేఖలు మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధి 11వ వార్డు ముత్యాల గల్లి, ఆదర్శనగర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 మంది వరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుల వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరులో అభివృద్ధిని వేగవంతం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే బైపాస్, నేషనల్ హైవే రోడ్డు పనులు, పాత తాండూరు బ్రిడ్జి, జినుగుర్తిలో పారిశ్రామిక వాడ వంటి అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో తాండూరు రూపు రేఖలు మార్చే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని సాయిపూర్లో కమ్యూనిటి హాల్ కట్టిస్తామని, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని హామి ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు చేరడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతో ష్ గౌడ్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, కాలనీ, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



