నేడు విద్యాసంస్థలకు సెలవు
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్, దర్శిన ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉన్నందున బుధవారం రోజున పాఠశాలలు, విద్యాసంస్థలకు కలెక్టర్ ఒక రోజు సెలవు ప్రకటించారు. ఆదేవిధంగా మండలాల వారిగా వర్షాభావ పరిస్థితులను సమీక్షించారు. రాత్రి వేళల్లో వర్షాలు ఎక్కువ కురిసే అవకాశాలు ఉండడంతో అధికారులు అందరు తమ తమ మండల కేంద్రాలలోనే ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నీటి ప్రవాహం సాగే ప్రాంతాలను, మార్గాలను రాత్రి పూట మూసివేయాలని సూచించారు. ఉదృతంగా నీరు ప్రవహించే చెరువులు, వాగుల వద్ద ఇసుక సిమెంట్ బస్తాలను సిద్ధంగా అంచుకోవాలన్నారు. పాత ఇండ్లలో ఎవ్వరు కూడా ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.



