గ‌ల్లిగ‌ల్లీలో గ‌ణ‌నాథుల‌కు పూజ‌లు

తాండూరు

గ‌ల్లిగ‌ల్లీలో గ‌ణ‌నాథుల‌కు పూజ‌లు
– మండ‌పాల వ‌ద్ద భ‌క్తుల‌కు అన్న‌దానాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తాండూరు ప‌ట్ట‌ణంలోని గ‌ల్లిగ‌ల్లీలో ప్ర‌తిష్టించిన వినాయ‌కుల‌కు భ‌క్తులు ఘ‌నమైన పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. నాలుగో రోజు సోమ‌వారం ముందుపూజ‌ల దేవుడు గ‌ణేషునికి పూజ‌లు నిర్వ‌హించి ప్ర‌సాదాల‌తో నైవేద్యాలు స‌మ‌ర్పించారు. మ‌ధ్యాహ్నం వేళ ప‌లు ప్రాంతాల్లో మండ‌పాల వ‌ద్ద భ‌క్తుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. 23వ వార్డులో ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మానికి మాజీ కౌన్సిల‌ర్, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కురాలు గ‌డ్డ‌లి ప‌రిమ‌ళ ర‌వీంద‌ర్ హాజ‌రై వినాయ‌కున్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం స‌మితి స‌భ్యుల‌తో క‌లిసి భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ‌త‌యేడాది క‌రోనా కార‌ణంగా ఉత్స‌వాల‌ను జ‌రుపుకోలేక‌పోయామ‌న్నారు. ఈ సారి గ‌ణేష్ ఉత్స‌వాల‌ను భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకోవాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌మితి స‌భ్యులు న‌రేష్‌, శివా, సందీప్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.