మరి కాసేపట్లో ఆ వార్డులకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– నేటి నుంచి రెండో విడత గల్లి గల్లికీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పర్యటించనున్నారు. పట్టణ సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన గల్లి గల్లికి ఎమ్మెల్యే రెండో విడత నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని 7,8,9,10,11,12,29,30 వార్డుల్లో పర్యటించనున్నారు. 7వ వార్డు గీతా మందిర్ నుండి కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఇది వరకే గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొదటి విడతలో పట్టణంలోని 18 వార్డుల్లో పర్యటించారు. నేటి నుంచి చేపట్టే రెండో విడతలో మిగతా 18 వార్డులలో పర్యటించబోతున్నారు.
