మల్కాపూర్ వ‌ర్షానికి కూలిన ఇళ్లు

తాండూరు వికారాబాద్

మల్కాపూర్ వ‌ర్షానికి కూలిన ఇళ్లు
– ఆదుకోవాలంటున్న స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండరి
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్ గ్రామంలో వ‌ర్షానికి ఇళ్లు కూలిపోయింది. గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షంతో గ్రామానికి చెందిన బాబు ఇళ్లు పైక‌ప్పు ఊడిప‌డింది. అ స‌మ‌యంలో ఇంట్లోని వారు దూరంగా ఉండ‌డంతో ఎలాంటి ప్రాణాపాయం జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ స‌ర్పంచ్ విజ‌య‌ల‌క్ష్మీ పండరి వారి ప‌రిస్థితిని ఆరా తీశారు. గ్రామ నేత‌ల ద్వారా కూలిన ఇంటిని గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబాల‌నికి చెందిన బాబు ఇంటిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌భుత్వం ఆ కుటుంబానికి ప‌రిహారం అందించి ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఙ‌ప్తి చేశారు. అధికారులు కూడ చొర‌వ చూపాల‌ని కోరారు. అదేవిధంగా గ్రామ‌ ఉప్పసర్పంచ్ అబ్దుల్ మాజీద్, గ్రామస్తులు కూడ బాబును ఆదుకోవాల‌ని కోరారు.