వీఆర్ఏలకు ఇచ్చిన హామిని నెరవేర్చాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

వీఆర్ఏలకు ఇచ్చిన హామిని నెరవేర్చాలి
– పే-స్కేల్ ను అమ‌లు చేయాలి
– బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామిని నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ అన్నారు. వీఆర్ఏల‌ డిమాండ్లను పరిష్కరించాలని తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల వీఆర్ఎలు ఆరు రోజులుగా సమ్మె చేపడుతున్నారు. శనివారం బిసి సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ వీఆర్ఏల డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చె యడం దారుణమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవి అన్నారు. వీఆర్ఏలు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఎలకు పే-స్కేల్ అమలు చేయాలన్నారు. లేదంటే బీసీ సంఘం తరుపున వారి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు చంద్రశేఖర్, గుండు, పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బోయ నరేష్, తాండూరు మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు బసంత్, నాయకులు చంద్రశేఖర్, రమేష్ టైలర్, ఎంఎస్ఎఫ్ నాయకులు స్వామిదాస్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, శివాజీ, రావణ్, మహేందర్, రాజేష్, నాని, గజేంద్ర, రవిచంద్ర, గోపాల్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.