అర్చ‌కుడిని ఖుషీ చేసిన ప‌టేల్ కిర‌ణ్

తాండూరు వికారాబాద్

అర్చ‌కుడిని ఖుషీ చేసిన ప‌టేల్ కిర‌ణ్
– జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల విత‌ర‌ణ
– మ‌జ్జిగ పంపిణీ కేంద్రంలో పేద‌ల‌కు అన్న‌దానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇళ్లు, ఆస్తి కోల్పోయిన ఓ అర్చ‌కుడిని తాండూరు వీర‌శైవ యువ‌ధళ్ మాజీ అధ్య‌క్షులు, ది గ్రీన్ అండ్ సీడ్స్ మ‌ర్చంట్స్ అసోసియేష‌న్ కోశాధికారి ప‌టేల్ కిర‌ణ్ కుమార్ సంతోష ప‌రిచారు. గత ప‌ది రోజుల క్రితం పెద్దేముల్ మండ‌లం గిర్మాపూర్ గ్రామంలో అగ్ని ప్ర‌మాదం వ‌ల్ల అర్చ‌కుడు జంగం చంద్ర‌శేఖ‌ర్ ఇళ్లు, ఆస్తిని కోల్పోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం ప‌టేల్ కిర‌ణ్ త‌న పుట్టిన రోజును పురస్క‌రించుకుని చేయూత‌నందించారు. గ్యాస్ స్ట‌వ్‌, గ్యాస్ సిలిండ‌ర్‌తో పాటు బియ్యం ఇత‌ర నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశారు. అదేవిధంగా
ప‌ట్ట‌ణంలోని చించొల్లి రోడ్డు మార్గంలో వైశ్య ఫెడ‌రేష‌న్, వాస‌విక్ల‌బ్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న మ‌జ్జిగ పంపిణీ కేంద్రంలో ప‌టేల్ కిర‌ణ్ పేద‌ల‌కు అన్న‌దానం చేశారు. అనంత‌రం అర్చ‌కుడికి సాయం అందించ‌డంతో పాటు పేద‌ల‌కు అన్న‌దానం చేసిన ప‌టేల్ కిర‌ణ్ కుమార్‌ను వైశ్య ఫెడ‌రేష‌న్ జిల్లా అధ్య‌క్షులు రొంప‌ల్లి సంతష్ కుమార్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైశ్య, వాస‌వి, వీర‌శైవ యువ‌ద‌ళ్ స‌భ్యులు పాల్గొన్నారు.