మృతదేహాన్ని మోసిన ఎమ్మెల్యే
– మనసుదోచిన డా. మెతుకు ఆనంద్
దర్శిని ప్రతినిధి : వాగులో కొట్టుకుపోయి పొదల్లో చిక్కుకున్న మృతదేహాన్ని మోసుకొచ్చి ఒడ్డుకు చేర్చేందుకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్డర్ మెతుకు ఆనంద్ సాయం అందించారు. దాదాపు 2 కిలో మీటర్లు మృతదేహాన్ని మోసుకవచ్చి మనసును గెలిచారు. మర్పల్లి మండలం తిమ్మాపూర్ మరియు రావుల పల్లి మధ్యలో ప్రవహిస్తున్న వాగులో నవాజ్‌రెడ్డి, అతని అక్కలు, అల్లుడుతో పాటు డ్రైవర్‌తో సహ కారు కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం నవ వధువు ప్రవళిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో పాటు నవాజ్‌రెడ్డి మరో అక్క\మృతదేహంను స్థానిక ముళ్లపొదల్లో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జిల్లా ఎస్సీ నారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి 4 కిలోమీటర్లు కాలినడకన నడిచి అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చటానికి ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహాయం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని ఎమ్మెల్యే స్వయంగా 2 కిలో మీటర్లు భుజం పై మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటనతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన సహాయానికి స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. సహాయక చర్యలతో ప్రజల మనుసులను గెలుచుకున్నారు. మరోవైపు మృతి చెందిన నవవధువు ప్రవళికకు ఈనెల 25న వికారాబాద్ మండలం రావులపల్లికి చెందిన నవాజ్ రెడ్డితొ వివాహం అయ్యింది. నవాజ్ రెడ్డి భార్య ప్రవళికతో పాటు అతని ఆక్కలు శ్వేత, రాధిక, అల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి కారులో అత్తారింటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ వద్ద వాగులో కొట్టుకుపోయి ఈ విషాధకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవాజ్‌రెడ్డి, అక్క రాధలు ప్రాణాలతో బయట పడగా నవవధువు ప్రవళిక, అక్క మృతదేహలు బయటపడ్డాయి. ఇంకా అల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, ఆచూకి తెలియాల్సి ఉంది.
