ప్రజా సమస్యలపై గొంతెత్తండి
– బీజేపీ ఫ్లోర్ లీడర్‌గాగా అంతారం లలిత
– నియామకం చేసిన జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రజల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో గొంతెత్తాలని బీజేపి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ లు పేర్కొన్నారు. తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అంతారం లలిత నియామకం అయ్యారు. శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సదానందా రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్‌లు హాజరై ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి కౌన్సిల్ సమావేశంలో పోరాటం చేయాలన్నారు. ప్రజల తరుపున గొంతెత్తి వాటిని పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు సాహు శ్రీలత, లావణ్య, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గతంలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సిందూజ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆమె స్థానంలో అంతారం లలితను పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు.



