వాస్మోల్ అయిల్ సేవించి గృహిణి ఆత్మ‌హ‌త్య

క్రైం తెలంగాణ వికారాబాద్

వాస్మోల్ అయిల్ సేవించి గృహిణి ఆత్మ‌హ‌త్య
– భ‌ర్త వేధింపులు తాళ‌లేక భార్య బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
– వికారాబాద్ జిల్లా మ‌ర్ప‌ల్లి మండ‌లంలో విషాదం
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: జుట్టుకు రాసుకునే వాస్మోల్ అయిల్ సేవించిన ఓ గృహిణి ప్రాణాలు పోగొట్టుకుంది. భ‌ర్త వేధింపుల‌ను తాళ‌లేక ఓ మ‌హిళ సేవించి బ‌ల‌వ‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా మ‌ర్పల్లి మండ‌లంలోని రావుల‌ప‌ల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రావుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన మ‌హేంద‌ర్‌తో బ‌స్వ‌పూర్ గ్రామానికి చెందిన అనూష‌తో మూడేళ్ల‌క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఒక బాబు కూడ ఉన్నాడు. కొన్ని రోజులు సంసారం సాఫీగా సాగినా డ‌బ్బుల విష‌యంలో గొడ‌వ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో వేధింపులు అధిక‌మ‌వ‌డంతో అనూష తాళ‌లేక ఇంట్లో ఉన్న జుట్టుకు రాసుకునే వాస్మోల్ అయిల్ తాగేసింది. కొద్ది సేప‌టి త‌రువాత అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. బాధిత కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు మ‌ర్ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.