డీకే అరుణ‌కు స‌న్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

డీకే అరుణ‌కు స‌న్మానం
– శాలువాతో స‌త్క‌రించిన బొప్పి కుటుంబం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌ను తాండూరు నేత‌లు స‌న్మానించారు. సోమ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టే ప్ర‌జా గోస – బీజేపీ భ‌రోసా యాత్ర కార్య‌క్ర‌మంలో డీకే అరుణ ముఖ్య అథితిగా హాజ‌రయ్యారు. అనంత‌రం డీకే అరుణ, మాజీ మంత్రి ఎ.చంద్ర‌శేఖ‌ర్ రావులు బీజేపీ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొప్పి శ్రీ‌హ‌రి నివాసాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా బొప్పి శ్రీ‌హ‌రి, శిరీష‌లు డీకే అరుణ‌తో పాటు ఎ.చంద్ర‌శేఖ‌ర్ రావును శాలువాల‌తో స‌న్మానించారు. వారి నివాసంలో విందు అనంత‌రం డీకే అరుణ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మై కాసేపు ముచ్చటించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, బీజేవైఎం నాయ‌కులు శ్రీ‌కాంత్ రెడ్డి, అశోక్ త‌దిత‌రులు ఉన్నారు.