బీఆర్ఎస్ నేతపై కేసు..!
– కాంగ్రెస్ మహిళ నేత ఫిర్యాదుతో నమోదు
– ఆయనతో పాటు మరికొందరిపై కూడ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి, మరికొందరిపై పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు చేసిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవికి పట్టణంలోని ఆదర్శనగర్‌లో సాయిపూర్ శివారులో సర్వేనెంబర్ 95,96,106, 107లో 1ఎకరా 7 గుంటల భూమి ఉంది. ఈ భూమిపై శ్రీనివాస్ చారి, మరికొందరి వ్యక్తుల మద్య వివాదం కొనసాగుతోంది.
ఈక్రమంలో ఈనెల 2వ తేదిన విజయాదేవికి చెందిన భూమిలో పాతిన సిమెంట్ స్థంబాలు, పలకలను మంకాల ప్రవీణ్, శ్రీనివాస్ చారిలు కూలీలతో ధ్వంసం చేయించారని విజయాదేవి ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా దుర్భాషలాడుతూ చంపేస్తామని బెధిరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు సంబంధించిన భూమి హైకోర్టు ద్వారా సర్వే చేయించుకున్నప్పటికి తమ భూమిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు నిందితులుగా మంకాల ప్రవీణ్, శ్రీనివాస్ చారి, మరికొందరిని పరిగణిస్తూ వారిపై సెక్షన్ 329(3), 324(4), 352, 351(2), ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.
ఇదికూడా చదవండి…

